ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సెక్స్ కోసం సబ్సిడీ.. వ్యభిచారానికి చట్టబద్దత!

by  |
prostitution
X

దిశ, డైనమిక్ బ్యూరో : రెండు క్షణాల క్షణికానందం కోసం నిత్యం ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వావివరసలు, చిన్న, పెద్ద తేడా లేకుండా సెక్స్ కోసం వెంపర్లాడుతున్నారు. మర్డర్లు, మానభంగాలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ జరగకుండా ఉచితంగా సెక్స్ చేసుకోండి అని ప్రభుత్వమే ఓ పథకం పెడితే..! ఛీ.. అదేమన్న రైతుబంధా.. దళిత బంధు పథకమా ఉచితంగా ఇవ్వడానికి అనుకుంటున్నారా..? కొంత ఆశ్చర్యం, కొంత వింత అనిపించినా ఇది నిజమే.. వికలాంగులు సెక్స్ సుఖం అనుభవించడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. కాకపోతే ఇది మన తెలంగాణలోనో, భారతదేశంలోనో కాదు.. నెదర్లాండ్‌లో మాత్రమే.. ఇంతకూ విషయం ఏంటంటే..

ప్రతి ఒక్కరిలోనూ సెక్స్ ఫీలింగ్స్ ఉంటాయి. బయటకు చెప్పకపోయినా ఆడ వారైనా.. మగవారైనా ఒక్కసారైనా సెక్స్ అనుభవాన్ని ఫీల్ అవ్వాలనుకుంటారు. అయితే, దీనిని ఫీల్ అవ్వలేకపోతున్నామని వికలాంగులు బాధపడుతున్నారని గమనించిన నెదర్లాండ్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ విద్య నుంచి గృహాల వరకు ప్రతిదానిపై సామాజిక సబ్సిడీలను అందిస్తోంది నెదర్లాండ్స్ ప్రభుత్వం. అయితే, వికలాంగులకు సెక్స్‌పై సబ్సిడీని అందించే కీలక నిర్ణయం తీసుకుంది.

ఆ దేశంలో వ్యభిచారం చట్టబద్ధం చేసి.. సెక్స్‌ని ప్రతి ఒక్కరూ ఆనందించగలిగే హక్కుగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సెక్స్ సబ్సిడీ కోసం ప్రత్యేకంగా సెక్స్ గ్రాంట్లు లేనప్పటికీ పౌరులు ప్రభుత్వం నుంచి పొందే ప్రయోజనాలను వారికి ఇష్టపడే విధంగా ఖర్చు చేయొచ్చు. ఈ క్రమంలో సంవత్సరానికి 12 సార్లు సెక్స్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయితే దీనిని మరింత పెంచాలని కూడా అక్కడి వికలాంగ పౌరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సెక్స్ అనేది వికలాంగులను మానసికంగా ధృడంగా చేసి, ఒత్తిడి నుంచి ఉపశమనం చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

దారుణం.. అర్ధరాత్రి మాటువేసి దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారం


Next Story

Most Viewed