- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. అర్ధరాత్రి మాటువేసి దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారం
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఓ దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారానికి పాల్పడ్డాడు. మాటువేసి ఆరుబయట మరుగుదొడ్డికి వెళ్లిన మహిళపై లైంగిక దాడి చేసి.. ఎవరికీ ఈ విషయం చెప్పొదు అంటూ హెచ్చరించి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లాలో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సీఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సీలేరుకు చెందిన దివ్యాంగురాలి(30)ని పెళ్లి అయిన కొద్ది నెలలకే భర్త వదిలేశాడు. దీంతో బాధితురాలు.. తల్లి వద్దే ఉంటూ స్థానికంగా వ్యాపారం చేసుకుంటోంది. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఓ దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారానికి పాల్పడ్డాడు. మాటువేసి ఆరుబయట మరుగుదొడ్డికి వెళ్లిన మహిళపై లైంగిక దాడి చేసి.. ఎవరికీ ఈ విషయం చెప్పొదు అంటూ హెచ్చరించి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లాలో ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై సీఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సీలేరుకు చెందిన దివ్యాంగురాలి(30)ని పెళ్లి అయిన కొద్ది నెలలకే భర్త వదిలేశాడు. దీంతో బాధితురాలు.. తల్లి వద్దే ఉంటూ స్థానికంగా వ్యాపారం చేసుకుంటోంది. వారం క్రితం బాధితురాలి తమ్ముడికి అనారోగ్యం కారణంగా.. తల్లి అతడిని విజయనగరానికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాధితురాలు సోమవారం అర్ధరాత్రి ఆరుబయట ఉన్న మరుగుదొడ్డికి వెళ్లింది. అక్కడే మాటు వేసిన వైసీపీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు నాళ్ల వెంకటరావు ఆమెపై దాడిచేసి చున్నీతో నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి, అక్కడి నుంచి పరారయ్యాడు. బుధవారం ఇంటికి వచ్చిన బాధితురాలి తల్లికి ఈ విషయం తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడిపై ఐపీసీ 376, దివ్యాంగుల సెక్షన్ కింద కేసులు నమోదు చేశామని సీఐ తెలిపారు. వెంకటరావును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.






