అమ్మాయి బాగుందని నెంబర్ అడుగుతున్నారా?.. ఇది మీకోసమే..

by  |
అమ్మాయి బాగుందని నెంబర్ అడుగుతున్నారా?.. ఇది మీకోసమే..
X

దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డుపై వెళ్లే అమ్మాయిని చూడగానే.. ఎలా అయినా నెంబర్ తీసుకోవాలని, ఆమె వెంటపడుతున్నారా?, అయితే.. మిమ్మిల్ని ఎవరూ కాపాడలేరు.. రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. కానీ కొందరు ఆకతాయిల వల్ల యువతులు, మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అలాంటి వారిపై ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ పోలీసులు దృష్టిసారించారు. ఈ క్రమంలో యువత ఎక్కువగా ఉండే బస్ స్టాపులు, స్కూల్, కాలేజీ ప్రాంతాల్లో మఫ్టీలో మహిళా పోలీసులు ఉండి ప్రతి ఒక్కరినీ గమనిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆకతాయిలను గుర్తించి వెంటనే పోలీస్ స్టేషన్ కి తరలించే అవకాశం ఉంటుంది.

అయితే, దీనిపై ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో దీనిని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ వారు చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. “ అందులో ఇద్దరు స్నేహితుల వాట్సప్ చాట్ ఉంది. అందులో మొదటి వాడు.. టైం పాస్ కావట్లేదని బస్ స్టాప్‌లో కూర్చున్న.. ఒక అమ్మాయి మంచిగా ఉందని నెంబర్ అడిగా?.. రెండోవాడు.. ఇచ్చిందా?? అని అన్నాడు.. దానికి మొదటివాడు ఇచ్చింది.. 9490617444 అది షీం టీం నెంబర్ అట, ఆమె పోలీస్ కానిస్టేబుల్ అంట.. అని అన్నాడు. ఓరినీ ఆ తర్వాత ఏం జరిగిందని రెండోవాడు అడిగాడు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లగానే ఒక కానిస్టేబుల్ వచ్చి టిఫిన్ ఇచ్చాడు, మధ్యాహ్నం ఎస్సై వచ్చి లంచ్ ఇచ్చాడు, లాస్ట్‌లో సీఐ వచ్చి డిన్నర్ కొంచెం గట్టిగానే పెట్టాడు అని అన్నాడు. నిన్ను చూస్తుంటే తెలుస్తుంది లే.. ఆ తర్వాత ఏమైందని రెండో వాడు అడగగా.. నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు, అమ్మా నాన్నను కూడా పిలుస్తా అంటే వద్దు ఇలాంటివి మళ్లీ రిపీట్ చేయను అంటే వదిలేశారు అని చెప్పాడు. ” ఇలా మహిళలను విసిగిస్తున్నట్లు కనిపిస్తే.. తీసుకెళ్లి గట్టిగా భోజనం పెడతారంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.


Next Story

Most Viewed