- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రహమత్ నగర్‌లో నిరంతరం డ్రైనేజీ సమస్య.. ప్రజలు తీవ్ర ఇక్కట్లు
జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో వారం , పది రోజులుగా పారిశుధ్యం పనులు ఎక్కడివేసిన గొంగళిగా ఉంది.

దిశ, జూబ్లీహిల్స్: జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో వారం , పది రోజులుగా పారిశుధ్యం పనులు ఎక్కడివేసిన గొంగళిగా ఉంది. బోరబండ సర్కిల్ -37 జీహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా కాలనీలు, బస్తీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. సాధారణంగా హైదరాబాద్ ప్రాంతాలలో వర్షంలో ఎక్కువ గా డ్రైనేజీ లు పొంగి,రోడ్ల పై మురుగు చేరుతుంది. కానీ ప్రధానంగా రహమత్ నగర్ డివిజన్ లోని ఎస్పీఆర్ హిల్స్ ప్రాంతంలో నిరంతరం డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా మారటంతో, వేసవి కాలం , వర్షాకాలం , శీతాకాలం ఏ కాలం అయినా కాలం తో సంబంధం లేకుండా డ్రైనేజీ పొంగు పొర్లుతూ దాదాపు 2 కిలోమీటర్ ల మేర రోడ్ల పై డ్రైనేజీ మురుగు నీరు పడుతుంది. దీనితో రోడ్లపై నిరంతరం ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. నిరంతరం డ్రైనేజీ పొంగిపొర్లుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్రంగా అనారోగ్య భారిన పడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు.
పారిశుధ్య నిర్వహణపై తీవ్ర ప్రభావం
గత ఎన్నికల్లో రహమత్ నగర్ ను అభివృద్ధి మార్గంలో ముందు నిలుపుతానన్న మంత్రులు ఈ ప్రాంతాన్ని పట్టించుకునే జాడే లేదు అని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే రహదారులను శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో పాల్గొనడమే ఇందుకు కారణం. సర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు పారిశుధ్య కార్మికుల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. చాలా సర్కిళ్లల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ బాధ్యతను పారిశుధ్య కార్మికులకు అప్పగించారు.విద్యావంతులైన పారిశుధ్య కార్మికులు, ఎస్‌ఎఫ్ఏలు కొన్నిచోట్ల బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్‌ఓ)లు గానూ కొనసాగుతున్నారు. ఇది పారిశుధ్య నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిజానికి, జీహెచ్ఎంసీ పరిధిలో అవసరానికి సరిపడా పారిశుధ్య కార్మికులు లేరు. కాగితాల్లో ఉన్న స్థాయిలోనూ క్షేత్రస్థాయిలో శానిటేషన్ వర్కర్లు కనిపించటం లేదు. బయోమెట్రిక్, ముఖ ఆధారిత హాజరు వంటి అధునాతన సాంకేతికత వినియోగిస్తున్నాప్పటికీ కార్మికులు పూర్తిస్థాయిలో విధులకు హాజరవ్వడం లేదు అనేది అతిశయోక్తి కాదు.
నెంబర్ వన్ నియోజకవర్గంగా..
కొందరు పూర్తిగా గైర్హాజరవుతుండగా.. ఇంకొందరు హాజరు వేసుకొని ఇంటికి వెళ్తున్నారు. సిబ్బంది కొరత వల్ల ప్రధాన రహదారులు మినహా, కాలనీలు, బస్తీల్లోని అంతర్గత రోడ్లలో రోజూ స్వీపింగ్ జరగడం లేదు. ఈ నేపథ్యంలో పారిశుధ్య కార్మికులకు ప్రస్తుతం సర్ విధులు అప్పగించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారం రోజులుగా రహదారుల ఊడవకపోవడంపై ప్రజలు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. కానీ స్పందన లేదు. మొత్తంగా సర్ ట్రై కార్పొరేషన్లలోని శానిటేషన్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. జూబ్లీహిల్స్ ను హైదరాబాద్ లోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిత్తునన్న మంత్రులు , అధికారులు ఏదో ఒక అభివృద్ధి పనులు ప్రారంభానికి వచ్చి వెళ్తున్నారే తప్ప పూర్తిస్థాయి అభివృద్ధి ఐతే జరగటం లేదని , ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉందని , డ్రైనేజీ వ్యవస్థ , నాల ప్రక్షాళన పనులు అలానే ఉన్నాయని మందకొడిగా పనులు జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. వర్షాకాలం రానే వచ్చింది డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి , అధికారులు , సిబ్బంది తమ పని పక్కన పెట్టి సర్ పనిలో నిమగ్నమై ఉండటం తో ఇంకా పారిశుధ్యం దుస్థితి దారుణంగా మారిందని ఇకనైనా అధికారులు సమస్యలపై దృష్టి పెట్టీ పరిస్కరదిశగా పనిచేయాలని ప్రజలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






