ఎప్పుడూ నీ చేయి వీడను: కోహ్లి ట్వీట్‌ వైరల్‌

by Disha Web Desk 13 |
ఎప్పుడూ నీ చేయి వీడను: కోహ్లి ట్వీట్‌ వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: విరాట్‌ కోహ్లి తన భార్య అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు. భార్య పుట్టినరోజు సందర్భంగా.. ‘‘నా సర్వస్వం నువ్వే’’ అంటూ అందమైన ఫొటోలతో విషెస్‌ తెలిపాడు. ఈ నైపథ్యంలో మే 1న అనుష్క శర్మ 35వ పుట్టినరోజున కోహ్లి ఆత్మీయ ట్వీట్‌ చేశాడు. 'ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నీ చేయి వీడను. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా నీకు నేను తోడుంటాను.. నా సర్వస్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ అనుష్కపై ప్రేమను కురిపించాడు. ఈ సందర్భంగా అనుష్క శర్మకు సంబంధించిన ఫొటోలను కోహ్లి తన ట్విట్టర్‌లో పంచుకున్నాడు. కోహ్లి చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్‌-2023లో అదరగొడుతున్నాడు. ఫాఫ్‌ డుప్లెసిస్‌ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కలిపి 333 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 82 నాటౌట్‌. ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో నాలుగింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

Read more:

Happy Birthday Anushka Sharma :నేడు అనుష్క శర్మ పుట్టిన రోజు..

Next Story