U19 World Cup Final: ఫైనల్లో ఫోర్లు, సిక్సర్ల వర్షం.. వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 12:45:02  IST  )

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ICC అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో యువ భారత జట్టు అదరగొడుతోంది.

U19 World Cup Final: ఫైనల్లో ఫోర్లు, సిక్సర్ల వర్షం.. వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ICC అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో యువ భారత జట్టు అదరగొడుతోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సెంచరీ కదంతొక్కాడు. అతడు కేవలం 54 బంతుల్లో 100 పరుగుల చేశాడు. అందులో 8 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్ లాస్ట్ సెంచరీ హీరో ఆరోన్ జార్జ్ కేవలం 9 పరుగులకే పెవీలియన్ చేరాడు. అనంతర క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రే 51 బంతుల్లో 53 పరుగులు చేసి అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో బెన్ మాయెస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం భారత జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి 2 కీలక వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. సూర్యవంశీ 104 పరుగులు, వేదాంత్ త్రివేది 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్ 2 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు ఈ ఇన్నింగ్స్ ద్వారా వైభవ్ ఒక అరుదైన ఘనత సాధించాడు. అండర్-19 వరల్డ్ కప్ ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు (20) కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Under-19 World Cup: వచ్చినోడు వచ్చినట్లు ఒకటే ఉతుకుడు.. ఫైనల్లో భారత్ భారీ స్కోర్

Next Story