- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Under-19 World Cup: వచ్చినోడు వచ్చినట్లు ఒకటే ఉతుకుడు.. ఫైనల్లో భారత్ భారీ స్కోర్
జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వేదికగా అండర్19 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతోంది. భారత్ - ఇంగ్లాండ్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వేదికగా అండర్19 వరల్డ్ కప్ ఫైనల్(Under-19 World Cup Final) జరుగుతోంది. భారత్ - ఇంగ్లాండ్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. అనుకున్నట్లుగానే రెచ్చిపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. డాషింగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశారు. ఏకంగా 15 సిక్సులు, 15 ఫోర్లు కొట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఫాస్టెస్ట్ 150(71B) చేసిన క్రికెటర్‌గా, U19 WC ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డులు నెలకొల్పారు. కానీ త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నారు. మానీ లమ్స్‌డెన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యారు. కెప్టెన్ ఆయుష్ మాత్రే అర్థ శతకం(53)తో రాణించగా.. అభిజ్ఞాన్ కుందు(40), వేదాంత్ త్రివేది (32) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3, మోర్గాన్ 2, అలెక్స్ గ్రీన్ 2, మానీ ఒక వికెట్ తీశారు. మొత్తంగా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన టీమిండియా 411 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 412 పరుగులు చేయాల్సింది.






