- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఉర్విల్.. తండ్రికి అంకితం ఇచ్చిన సీఎస్కే బ్యాటర్

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ ఉర్విల్ పటేల్ సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని బాదాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అతను కేవలం 13 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ యశస్వి జైశ్వాల్ కూడా 13 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. 2023లో కోల్‌కతాపై ఈ ఫీట్ సాధించాడు. తాజాగా జైశ్వాల్ రికార్డును ఉర్విల్ సమం చేశాడు. ఈ రికార్డు హాఫ్ సెంచరీని ఉర్విల్ తన తండ్రికి అంకితం చేశాడు.
50 పరుగుల మార్క్‌ను అందుకున్న తర్వాత తన ప్యాంట్ జేబులో నుంచి ఓ నోట్ తీసి చూపించాడు. అందులో ‘ఇది మీ కోసమే నాన్న’ అని రాసి ఉంది. అంటే ఉర్విల్ ముందుగానే ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాలనే మైండ్ సెట్‌తోనే మైదానంలోకి అడుగుపెట్టాడని అర్థమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ సీజన్‌లో మూడు గేములు ఆడిన అతను ఆకట్టుకోలేదు. వరుసగా 4, 24, 17 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా రాణించాలనే పంతంతోనే వచ్చిన అతను సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఉర్విల్ తండ్రి ముకేశ్ పటేల్ కూడా మాజీ స్ప్రింటర్. ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ కూడా. అందుకే ఉర్విల్ తన తండ్రి చిన్నప్పటి నుంచే క్రీడలపై వైపు ప్రోత్సహించారు. గుజరాత్‌కు చెందిన ఉర్విల్ దేశవాళీలో బిగ్ హిట్టర్‌గా గుర్తింపు పొందాడు. 2023 విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది అందరిని ఆకర్షించాడు.






