ఉర్విల్ మెరుపులు.. CSK సూపర్ విక్టరీ

by Muthe.Rajitha |   (  Updated:2026-05-10 14:27:17  IST  )

ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠ భరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

ఉర్విల్ మెరుపులు.. CSK సూపర్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠ భరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఉర్విల్ పటేల్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 13 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న ఉర్విల్, మొత్తంగా 23 బంతుల్లో 65 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. అతడికి తోడుగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42), సంజు శాంసన్ (28), కార్తీక్ శర్మ (20) తమ వంతు సహకారం అందించారు. లఖ్‌నవూ బౌలర్లలో దిగ్వేష్ సింగ్, షాబాజ్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ చెన్నై విజయాన్ని అడ్డుకోలేకపోయారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 33 బంతుల్లోనే 85 పరుగులు సాధించాడు. చివర్లో షాబాజ్ అహ్మద్ (43 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో లఖ్‌నవూ స్కోరు 200 దాటింది. చెన్నై బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లతో లఖ్‌నవూ బ్యాటర్లను కట్టడి చేశాడు. అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న సమయంలోనూ కీలక వికెట్లు తీసి లఖ్‌నవూను మరిన్ని పరుగులు చేయకుండా నిరోధించగలిగారు. పాయింట్ల టేబుల్ లో చెన్నై తన స్థానాన్ని మెరుగు పరుచుకోగా.. లక్నో ఫ్యాన్స్ కు నిరాశలో మునిగిపోయింది.

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఉర్విల్.. తండ్రికి అంకితం ఇచ్చిన సీఎస్కే బ్యాటర్

Next Story