- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCup2026: రోహిత్ అడుగుజాడల్లో.. తనదైన శైలిలో..
టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ వారసుడిగా బాధ్యతలు చేపట్టడంపై ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ వారసుడిగా బాధ్యతలు చేపట్టడంపై ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. "షూస్ నావే కావొచ్చు, కానీ అడుగుజాడలు మాత్రం రోహిత్ భాయ్‌వే. ఆయన కింద ఆడుతున్నప్పుడు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అదే వ్యూహాన్ని, అదే 'ఫండా'ను నేను డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లాను. దానికి గౌతమ్ గంభీర్ అనుభవం తోడైంది," అని సూర్య చమత్కరించారు. ఈ జట్టులో వ్యక్తిగత మైలురాళ్లకు తావులేదని సూర్య స్పష్టం చేశారు. తిలక్ వర్మ ఆడిన 7 బంతుల్లో 21 పరుగుల ఇన్నింగ్స్ అయినా, సంజూ శాంసన్ సెంచరీ వైపు చూడకుండా జట్టు స్కోరు కోసం ఆడే విధానం అయినా.. అన్నీ నిస్వార్థ పోరాటాలేనని కొనియాడారు.
"టీ20ల్లో సెంచరీలు చేయడం కంటే, జట్టు కోసం వేగంగా ఆడటమే ముఖ్యం. మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరూ వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించరు," అని ఆయన గర్వంగా చెప్పారు. "నేను కెప్టెన్ అయిన కొద్ది నెలలకే ఒక విషయం అర్థమైంది. ఇక్కడ 'బాప్' (తండ్రి) లాగానో లేదా 'భాయ్' (పెద్దన్న) లాగానో పెత్తనం చలాయిస్తే ఏమీ జరగదు. ఆటగాళ్లను వారి దారిలో వదిలేయాలి. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వారు మైదానంలో అద్భుతాలు చేస్తారు. వారి చెవులు పట్టుకుని లాగడం వల్ల ప్రయోజనం ఉండదు." అని సూర్య చెప్పుకొచ్చారు.






