- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ క్రికెటర్లకు ఇది అలవాటే...వారిది యూటర్న్‌ల చరిత్ర
టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఇండియా మ్యాచ్ ను బహిష్కరించిన పాకిస్తాన్ పై సీరియస్ అయ్యారు సునీల్ గవాస్కర్.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ మరో నాటకానికి తెరదించింది. ముందుగా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని బెదిరింపులకు దిగిన పాకిస్తాన్, ఇప్పుడు ఇండియా మ్యాచ్ ఆడబోమంటూ ఓవరాక్షన్ చేస్తోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నమెంట్ లో షెడ్యూల్ ప్రకారం అన్ని మ్యాచ్ లు ఆడతాం కానీ, భారత్ తో మాత్రం ఆడబోమని ప్రకటన చేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు.
పాక్ జట్టుకు ఇదేమి కొత్త కాదు..వాళ్లవి అన్ని నాటకాలే - సునీల్ గవాస్కర్
టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఇండియా మ్యాచ్ ను బహిష్కరించిన పాకిస్తాన్ పై సీరియస్ అయ్యారు సునీల్ గవాస్కర్. వాళ్లకు ఇలాంటి డ్రామాలు కొత్త కాదని చురకలు అంటించారు. ఒక స్టాండ్ పై ఉండే మనస్తత్వం పాకిస్తాన్ జట్టుది కాదంటూ ఫైర్ అయ్యారు. ముందుగా ఒక నిర్ణయం తీసుకొని.. రెండు రోజులకే ప్లేట్ మార్చే రకం అంటూ పాకిస్తాన్ పరువు తీశాడు. ముందు నుంచి పాకిస్తాన్ క్రికెటర్లకు ఇది అలవాటేనని.. వాళ్లది యూటర్న్ ల చరిత్ర అంటూ బాంబు పేల్చారు సునీల్ గవాస్కర్.
ఇక బాయ్ కాట్ చేసిన నాలుగు రోజులకే మళ్లీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు. 15వ తేదీన మ్యాచ్ ఉన్న నేపథ్యంలో.. ఆ లోపే బాయ్ కాట్ పై పాకిస్తాన్ వెనక్కి తగ్గే ఛాన్సులు ఉన్నాయని సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక ఇదే విషయంపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా స్పందించారు. పాకిస్తాన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారమే, తాము నడుచుకుంటామన్నారు. రేపే మ్యాచ్ ఆడమంటే, తాము సిద్ధం గా ఉంటామని వివరించారు. ఇందులో పాకిస్తాన్ సర్కార్ దే ఫైనల్ నిర్ణయం అన్నారు.






