- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాయ్‌కాట్ వివాదం..పాకిస్తాన్ నిర్ణయంపై బీసీసీఐ కీలక ప్రకటన
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా మ్యాచ్ పాకిస్తాన్ బాయ్ కాట్ చేయడంపై బీసీసీఐ తరఫున రాజీవ్ శుక్లా స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ( T20 World Cup) టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఆడడంపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో భారత్ తో మినహా అన్ని మ్యాచ్ లు ఆడతామని పాకిస్తాన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ( BCCI) అధికారి రాజీవ్ శుక్లా (Rajeev Shukla ) స్పందించారు. ఎలాంటి వివాదాలు మాట్లాడకుండా సింపుల్ గా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు రాజీవ్ శుక్లా. పాకిస్తాన్ బాయ్ కాట్ చేయడంపై ఐసీసీ చూసుకుంటుందన్నారు.
పాకిస్తాన్ బాయ్ కాట్ పై స్పందించిన బీసీసీఐ
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా మ్యాచ్ పాకిస్తాన్ బాయ్ కాట్ చేయడంపై బీసీసీఐ తరఫున రాజీవ్ శుక్లా స్పందించారు. ఈ విషయంపై ఇప్పటికే ఐసీసీ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిందని తెలిపారు. క్రీడాల స్ఫూర్తికి విరుద్ధంగా పాకిస్తాన్ నిర్ణయం తీసుకోకూడదని ఐసీసీ సూచనలు చేసినట్లు స్పష్టం చేశారు. రాజకీయాలకు, క్రీడలకు సంబంధం ఉండకూడదని అంతర్జాతీ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించిందని గుర్తు చేశారు.
దానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇక ఈ వివాదం పై బీసీసీఐ ఎలాంటి స్టేట్మెంట్ చేయదలచుకోలేదు అన్నారు. ఏ విషయం ఉన్నా ఐసీసీతో చర్చిస్తామని తెలిపారు రాజీవ్ శుక్లా. దీంతో రాజీవ్ శుక్లా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారారు. ఇది ఇలా ఉండగా టీ20 ప్రపంచ కప్ 2026 ( T20 World Cup) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీన అంటే ఆది వారం రోజులన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరగాలి. కానీ ఇప్పుడు ఆ మ్యాచ్ జరుగడం కష్టమే అంటున్నారు.






