- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCup2026: అభిషేక్, వరుణ్‌ను తప్పించి.. రింకూ, కుల్దీప్‌ను తీసుకోండి..
గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా ఇవాళ హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా ఇవాళ హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇండియా, న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే తుది జట్టులో వ్యూహాత్మక మార్పులు చేయాలని సూచించారు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఇద్దరినీ పక్కనబెట్టి.. వారి స్థానంలో స్థానాల్లో రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు సలహా ఇచ్చారు. అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ ఐసీసీ నెంబర్ వన్ బ్యాటర్, బౌలర్ కావచ్చు.. కానీ ఇద్దరూ ఈ మెగా టోర్నమెంట్ పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చారు. తమ తప్పుల నుంచి పాఠాలు కూడా నేర్చుకోలేదు. తప్పులను సరిదిద్దుకోవడం లేదు. ప్రత్యర్థులు వీరిద్దరినీ చదివేశారు. వీరు ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టకుండా ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా వీరిద్దరినీ తప్పించాలని హెడ్‌కోచ్ గంభీర్‌కు సూచించారు.






