టీ20 ప్రపంచకప్ ఫైనల్: క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతున్న అహ్మదాబాద్.. స్టేడియంలో మూడంచెల భద్రత

by Ramesh Naini |   (  Updated:2026-03-08 13:02:05  IST  )

యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ సమరానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సర్వం సిద్ధమైంది.

టీ20 ప్రపంచకప్ ఫైనల్: క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతున్న అహ్మదాబాద్.. స్టేడియంలో మూడంచెల భద్రత
X

దిశ, డైనమిక్ బ్యూరో: యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ సమరానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సర్వం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమ్ ఇండియా, పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో నేడు సాయంత్రం తలపడనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ నగరం ఇప్పటికే క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఈ సాయంత్రం జరగనున్న ఫైనల్ పోరు కోసం భారత జట్టు తమ హోటల్ నుంచి స్టేడియానికి బయలుదేరింది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు హోటల్ వెలుపల అభిమానులు భారీగా గుమిగూడారు. "చక్ దే ఇండియా" నినాదాలతో అహ్మదాబాద్ వీధులు మారుమోగుతున్నాయి.

4,500 మంది పోలీసులతో పహారా..

ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా ఏర్పాట్లపై జాయింట్ సీపీ నీరజ్ కుమార్ బద్గుజర్ మాట్లాడుతూ.. పోలీసులు, హోమ్ గార్డులతో కలిపి మొత్తం 4,500 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. స్టేడియం లోపల మూడంచెల (3-layer) భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. బాంబు స్క్వాడ్ (BDDS) తో పాటు ప్రత్యేకంగా యాంటీ డ్రోన్ బృందాలను రంగంలోకి దించారు. ప్రేక్షకులు ఇబ్బంది పడకుండా స్టేడియం లోపలికి వెళ్లడానికి ప్రత్యేక ఛానెళ్లను, పెద్ద హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. కాగా, నేడు గెలిచి రెండోసారి వరుసగా ట్రోఫీని ముద్దాడాలని భారత్ పట్టుదలగా ఉండగా, తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని కివీస్ భావిస్తోంది.

T20WorldCup2026: అభిషేక్‌, వరుణ్‌ను తప్పించి.. రింకూ, కుల్దీప్‌ను తీసుకోండి..

Next Story