CSKలోకి స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌..మావోడు ఇర‌గ‌దీస్తాడంటూ తండ్రి క‌న్నీళ్లు

by velandi.Saikiran |   (  Updated:2025-12-17 06:45:37  IST  )

స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను రెండో రౌండ్ లో రూ.75 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది చెన్నై.

CSKలోకి స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌..మావోడు ఇర‌గ‌దీస్తాడంటూ తండ్రి క‌న్నీళ్లు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 మినీ వేలంలో సంచ‌నాలు చోటు చేసుకున్నాయి. గ్రీన్‌, మతీషా పతిరనా, లివింగ్‌స్టోన్ లాంటి ప్లేయ‌ర్ల‌పై కోట్ల వ‌ర్షం కురిపించాయి ఫ్రాంచైజీలు. ఇక దేశ‌వాళీ క్రికెట‌ర్ల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్రాధాన్యం ఇచ్చింది. కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌వీణ్ వీర్ లాంటి ప్లేయ‌ర్ల‌కు రూ.28 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసింది సీఎస్‌కే. ఇక అన్ సోల్డ్ ప్లేయ‌ర్ గా మిగిలిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను రెండో రౌండ్ లో రూ.75 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది చెన్నై. దీంతో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఫుల్ జోష్ లో క‌నిపిస్తున్నాడు. అటు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ ఎమోష‌న‌ల్ అయ్యారు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను కొనుగోలు చేసినందుకు చెన్నైకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. అన్ సోల్డ్ గా మిగిలిపోతాడ‌ని అనుకున్నా, కానీ చివ‌రి క్ష‌ణంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను జ‌ట్టులోకి తీసుకున్నందుకు రుణ‌ప‌డి ఉంటామ‌ని వివ‌రించారు. మావోడు ఇక ఇర‌గ‌దీస్తాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు నౌషాద్ ఖాన్.

Read More... ఆస్పత్రి బెడ్ పై టీమిండియా క్రికెటర్.. ఫోటో వైరల్

Next Story