Rishabh Pant : వెంటాడుతున్న గాయాలు.. మరో కీలక టోర్నీకి పంత్ దూరం..?

by Malleboina Mahesh |   (  Updated:2025-08-08 06:39:28  IST  )

భారత క్రికెట్ జట్టు కీపర్ రిషబ్ పంత్ గాయం తీవ్రంగా ఉండటంతో అతనికి ఆరు నెలల రెస్ట్ ఇవ్వాలని వైద్యులు తెలిపారు.

Rishabh Pant : వెంటాడుతున్న గాయాలు.. మరో కీలక టోర్నీకి పంత్ దూరం..?
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant)కు తీవ్ర గాయం (severe injury) అయింది. దీంతో అతను ఐదో టెస్టుకు దూరం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంత్ స్థానంలో ద్రువ్ జురేల్ కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. అంటే మరో నెల రోజుల్లో ఆసియా కప్ (Asia Cup) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పంత్ ఆడటంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సమయంలో పంత్ కు ఆరు నెలల రెస్ట్ అవసరం ఉందని డాక్టర్లు తెలపడంతో అతను ఆసియా కప్ ఆడటంపై క్లారిటీ వచ్చేసింది. అయితే దీనిపై బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా.. త్వరలో ఆసియా కప్ ఆడే తుది జట్టును ప్రకటించనున్నారు. దీంతో అతని స్థానంలో కొనసాగుతున్న ద్రువ్ జురేల్‌ను తీసుకుంటారా లేక.. సంజూ శాంసన్‌కు జట్టులో చోటు కల్పిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Haider Ali : రేప్ కేసులో పాకిస్తాన్ క్రికెటర్ అరెస్ట్..వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Next Story