- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Haider Ali : రేప్ కేసులో పాకిస్తాన్ క్రికెటర్ అరెస్ట్..వెలుగులోకి షాకింగ్ నిజాలు!
అత్యాచార ఆరోపణల నేపథ్యంలో... పాకిస్తాన్ క్రికెటర్ హైదర్ అలీని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్టు చేశారు. UK కు

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ క్రికెట్ లో మరో పెను సంచలనం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెటర్ హైదర్ అలీ ( Haider Ali ) కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. అతన్ని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో... పాకిస్తాన్ క్రికెటర్ హైదర్ అలీని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్టు చేశారు. UK కు సంబంధించిన ఓ మహిళ పట్ల... పాకిస్తాన్ క్రికెటర్ హైదర్ అలీ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం అందుతోంది. ఇక ఆ బాధిత మహిళ ఫిర్యాదు నేపథ్యంలో హైదర్ అలీని గ్రేటర్ మాంచెస్టర్ అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
ఈ సంఘటన నిన్న జరిగినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) కూడా స్పందించింది. అతనిపై సస్పెండ్ వేటు వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. జరిగిన సంఘటనపై కూడా ఆరా తీస్తోంది. ఇక హైదర్ అలీ అరెస్టు సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ స్టార్ ఆటగాడు హైదర్ అలీ వయసు 24 సంవత్సరాలు. అతను 2020 సెప్టెంబర్ ఒకటో తేదీన అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. తొలి వన్డే జింబాబ్వే జట్టు పైన ఆడాడు. అలాగే ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలి టి20 మ్యాచ్ ఆడాడు. అయితే 2022 నుంచి హైదర్ అలీ కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు.






