Rishabh Pant : టీమిండియా వన్డే కెప్టెన్ గా రిషబ్ పంత్ ?

by velandi.Saikiran |   (  Updated:2025-08-10 09:52:49  IST  )

రిషబ్ పంత్ కు వన్డే కెప్టెన్ ఇస్తారని తాజాగా నేషనల్ మీడియాలో ఒక కథనం వచ్చింది.

Rishabh Pant  : టీమిండియా వన్డే కెప్టెన్ గా రిషబ్ పంత్  ?
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి.. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పైన పడింది. వచ్చే నెలలో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీమిండియా యంగ్ ప్లేయర్లు అంతా సిద్ధమవుతున్నారు. ఇక ఇదే సమయంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కెరియర్.. ముగియబోతున్నట్లు చర్చ జరుగుతోంది.

2027 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేయకూడదని ఇప్పటికే బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదే జరిగితే... అతి త్వరలోనే టీమిండియా వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడని కూడా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా గిల్ ఉన్నాడు.

సూర్య కుమార్ యాదవ్ టి20 జట్టును లీడ్ చేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే రిషబ్ పంత్ కు వన్డే కెప్టెన్ ఇస్తారని తాజాగా నేషనల్ మీడియాలో ఒక కథనం వచ్చింది. ఈ మేరకు గౌతమ్ గంభీర్ సూచనలు చేశారట. రిషబ్ పంత్ కు వన్డే కెప్టెన్సీ ఇవ్వాలని పేర్కొన్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ పంత్ కు కెప్టెన్సీ చాన్స్ ఇస్తే.. వన్డే లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే ప్రమాదం కూడా ఉంటుంది.

Read More..

కోహ్లీ, రోహిత్ శర్మ చాప్టర్ క్లోజ్... ఇక ఆ సిరీసే చివరిది కానుందా!

Next Story