- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహ్లీ, రోహిత్ శర్మ చాప్టర్ క్లోజ్... ఇక ఆ సిరీసే చివరిది కానుందా!
2027 వరల్డ్ కప్ లో కోహ్లీ అలాగే రోహిత్ శర్మ పేర్లను పరిశీలించకుండా పక్కకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా తోపు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైందట. వన్డేల్లో వాళ్ళ కెరియర్ ముగించే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి అడుగులు వేస్తోంది. యంగ్ క్రికెటర్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ లను వన్డే జట్టు నుంచి బయటకు పంపించేందుకు ప్లాన్ చేస్తోందట.
ఇప్పటికే t20 లు అలాగే, టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడేసి... వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ప్లాన్ చేసుకున్నారు. కానీ వాళ్ళ ఆశలపై నీళ్లు పోస్తూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం అందుతోంది. 2027 వరల్డ్ కప్ లో కోహ్లీ అలాగే రోహిత్ శర్మ పేర్లను పరిశీలించకుండా పక్కకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట.
అంతకంటే ముందు కేవలం ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ లో మాత్రమే... వాళ్ళిద్దరిని ఆడించాలని అనుకుంటున్నారట. 2027 వరల్డ్ కప్ సమయానికి వాళ్ళ ఏజ్ 40 సంవత్సరాలకు చేరుకుంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ ఈ ఇద్దరికీ చివరిది కానుంది.






