తోటి ప్లేయర్ల మృతిపై స్పందించిన రషీద్ ఖాన్, రహ్మతుల్లా

by Malleboina Mahesh |   (  Updated:2025-10-18 03:19:42  IST  )

శుక్రవారం అర్ధారాత్రి పాకిస్తాన్ వైమానికదళం చేసిన దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

తోటి ప్లేయర్ల మృతిపై స్పందించిన రషీద్ ఖాన్, రహ్మతుల్లా
X

దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం అర్ధారాత్రి పాకిస్తాన్ వైమానికదళం చేసిన దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఎయిర్ స్ట్రైక్ లో మృతి చెందినది ఆఫ్ఘాన్ ప్లేయర్లే అని ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారికంగా దృవీకరించింది. దీంతో పాకిస్తాన్ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇదిలా ఉంటే తోటి ప్లేయర్ల మృతిపై ఆ దేశ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో "పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌పై జరిపిన వైమానిక దాడుల్లో పౌరులు మరణించడం నాకు చాలా బాధ కలిగించింది.

ప్రపంచ వేదికలపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న మహిళలు, పిల్లలు, ఆశావహ యువ క్రికెటర్ల ప్రాణాలను బలిగొన్న విషాదం ఇది. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా అనైతికం, అనాగరికం. ఈ అన్యాయమైన, చట్టవిరుద్ధమైన చర్యలు మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనను సూచిస్తాయి. ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌ల నుండి వైదొలగాలనే ACB నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో నేను నా దేశ ప్రజలతో నిలబడతాను, నాకు నా జాతీయ గౌరవం అన్నింటికంటే ముందుండాలి" అని రాసుకొచ్చాడు.

అలాగే మరో ప్లేయర్ రహ్మతుల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఆయన తన ట్వీట్‌లో "ఈ అణచివేతల ద్వారా అమాయక పౌరులను, మన దేశీయ క్రికెట్ ఆటగాళ్లను ఊచకోత కోయడం దారుణమైన, క్షమించరాని నేరం. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అమరవీరులకు స్వర్గంలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదిస్తారు. నేరస్థులను అవమానించి, వారిని తన కోపానికి గురిచేస్తారు. పాకిస్తాన్ మా ఆటగాళ్లను, పౌరులను చంపడం గౌరవం కాదు. ఇది అత్యంత అవమానకరం. ఈ రోజు పాక్ దుష్చర్యను ఆఫ్ఘనిస్తాన్ అంతటా ఆగ్రహాన్ని రేకెత్తించింది. చాలామంది దీనిని పౌరులపైనే కాకుండా దేశ క్రీడా స్ఫూర్తిపై కూడా దాడి గా అభివర్ణించారు." అని రాసుకొచ్చాడు.

Read More..

సంచలనం.. పాకిస్తాన్ వైమానిక దాడిలో ఆఫ్ఘానిస్తాన్ క్రికెటర్లు మృతి

Next Story