- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచలనం.. పాకిస్తాన్ వైమానిక దాడిలో ఆఫ్ఘానిస్తాన్ క్రికెటర్లు మృతి

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం (War atmosphere) కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు.. అదను చూసుకొని ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అర్ధరాత్రి పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి (Afghanistan cricketers die) చెందినట్లు తెలుస్తోంది. పాక్టికా ప్రావిన్స్ లో పాకిస్తాన్ కు చెందిన యుద్ధ విమానాలు (Pakistan fighter jets) మెరుపు దాడి చేశాయి.
ఇందులో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతుంది. ఉర్గున్ జిల్లాలో జరిగిన వైమానిక దాడిలో మరణించిన ఎనిమిది మందిలో కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ లను గుర్తించబడిన ఆటగాళ్లు ఉన్నారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (Afghanistan Cricket Board) ధృవీకరించింది. అలాగే ఈ దాడిలో మరో ఏడుగురు ప్లేయర్లు సైతం గాయపడినట్లు సమాచారం అందుతుంది.
Read More..
తోటి ప్లేయర్ల మృతిపై స్పందించిన రషీద్ ఖాన్, రహ్మతుల్లా






