- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రొఫెషనల్ ఫౌల్’ టర్నింగ్ పాయింట్.. ఉత్కంఠ పోరులో మాంచెస్టర్ యునైటెడ్ ఘన విజయం
ప్రీమియర్ లీగ్ పోరులో మాంచెస్టర్ యునైటెడ్ 2-1 తేడాతో క్రిస్టల్ ప్యాలెస్‌పై ఉత్కంఠభరిత విజయాన్ని సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రీమియర్ లీగ్‌లో భాగంగా క్రిస్టల్ ప్యాలెస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో యునైటెడ్ 2-1 తేడాతో గెలుపొందింది. అయితే, మ్యాచ్‌లో మలుపులు, వివాదాలు చోటుచేసుకోవడం అభిమానులను ఉత్కంఠకు గురిచేసింది. మ్యాచ్ ప్రారంభమైన 4వ నిమిషంలోనే క్రిస్టల్ ప్యాలెస్ ఆటగాడు మాక్సెన్స్ లాక్రోయిక్స్ అద్భుతమైన గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో యునైటెడ్ ఒత్తిడిలో పడింది.మ్యాచ్ 56వ నిమిషంలో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది.
కలిసొచ్చిన పెనాల్టీ..
గోల్ చేసిన లాక్రోయిక్స్, యునైటెడ్ ఆటగాడు మాథ్యూస్ కున్హాపై ‘ప్రొఫెషనల్ ఫౌల్’ చేయడంతో రెఫరీ అతనికి రెడ్ కార్డ్ ఇచ్చి మైదానం నుంచి పంపించేశాడు. కాగా, ఆ ఫౌల్ బాక్స్ వెలుపల జరిగిందని ప్యాలెస్ మేనేజర్ ఆలివర్ గ్లాస్నర్ వాదించినప్పటికీ వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) సమీక్ష తర్వాత అది పెనాల్టీగా ఖరారైంది. అనంతరం 57వ నిమిషంలో లభించిన పెనాల్టీని బ్రూనో ఫెర్నాండెజ్ గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. దీంతో 10 మంది ఆటగాళ్లతో ఆడుతున్న క్రిస్టల్ ప్యాలెస్‌పై యునైటెడ్ ఒత్తిడి పెంచింది. 65వ నిమిషంలో బెంజమిన్ సెస్కో నిర్ణయాత్మకమైన గోల్ చేసి మాంచెస్టర్ యునైటెడ్‌కు 2-1 చిరస్మరణీయ విజయాన్ని ఖాయం చేశాడు.






