- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లియోనెల్ మెస్సీ మ్యాజిక్.. ఇంటర్ మయామి చేతిలో ఆర్లాండో సిటీ చిత్తు
ఆర్లాండో సిటీతో జరిగిన ఉత్కంఠభరిత ఫ్లోరిడా డెర్బీలో ఇంటర్ మయామి 4-2తో ఘనవిజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: మేజర్ లీగ్ సాకర్ (MLS) మ్యాచ్‌లో ఇంటర్ మయామి, ఆర్లాండో సిటీపై 4-2 తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. 0-2తో వెనుకబడినప్పటికీ, సెకండాఫ్‌లో మయామి పుంజుకున్న తీరు ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే ఫస్ట్ హాఫ్‌లో ఆర్లాండో సిటీ ఆధిపత్యం ప్రదర్శించింది. 18వ నిమిషంలో మార్కో పాసాలిక్, 24వ నిమిషంలో మార్టిన్ ఓజెడా గోల్స్ చేయడంతో ఆర్లాండో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ద్వితీయార్థంలో ఇంటర్ మయామి అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు గోల్స్ చేసి విజేతగా నిలిచింది.
టాక్టికల్ మార్పు.. మాస్చెరానో మాస్టర్ ప్లాన్
ఫస్ట్ హాఫ్‌లో మయామి డిఫెన్స్ చాలా బలహీనంగా కనిపించింది. అయితే, విరామం సమయంలో కోచ్ జేవియర్ మాస్చెరానో చేసిన వ్యూహాత్మక మార్పులు ఏకంగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. లెఫ్ట్ బ్యాక్ నోహ్ అలెన్ స్థానంలో యువ స్ట్రైకర్ మేటియో సిల్వెట్టిని రంగంలోకి దించడంతో అటాకింగ్ అద్భుతంగా బలపడింది. ఇక ఆ జట్టు కీలక ఆటగాడు లియోనెల్ మెస్సీ మరోసారి తన క్లాస్ ఆటను ప్రేక్షకులకు చూపించాడు. 57వ నిమిషంలో స్కోరును సమం చేసిన మెస్సీ, మ్యాచ్ చివరి నిమిషంలో అద్భుతమైన ఫ్రీ-కిక్‌తో రెండో గోల్ కొట్టాడు. దీంతో 22 ఏళ్లుగా నిరంతరాయంగా గోల్స్, అసిస్ట్‌లు అందించిన అరుదైన రికార్డును మెస్సీ నెలకొల్పాడు. ఇక ఈ విజయంలో వెనిజులా మిడ్‌ఫీల్డర్ టెలాస్కో సెగోవియా కీలక పాత్ర పోషించాడు. అతను ఒక గోల్ చేయడమే కాకుండా, సహచర ఆటగాళ్లు రెండు గోల్స్‌కు చేసేందుకు సహకారం అందించాడు.






