- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ మినీ వేలంలో రూ.18 కోట్ల జాక్‌పాట్ కొట్టిన పతిరన
ఐపీఎల్ 2026కు సంబంధించిన మినీ వేలం ఈ రోజు ప్రారంభం అయింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026కు సంబంధించిన మినీ వేలం ఈ రోజు ప్రారంభం అయింది. ఇందులో ఆయా జట్లు వదిలేసిన ప్లేయర్లను కొనుగోలు చేసుకుందు ప్రాంచైజీలు పోటీ పడటంతో భారీ ధరకు అమ్ముడు పోతున్నారు. ఈ క్రమంలో 'బేబీ మలింగ'గా పేరుపొందిన యువ పేస్ బౌలర్ మతీషా పతిరన కోసం ఈ వేలంలో తీవ్రమైన పోటీ నెలకొంది. తుది బిడ్డింగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు అతడిని భారీ ధర ₹18.00 కోట్లకు దక్కించుకుంది. 100 T20 మ్యాచ్‌ల్లో 133 వికెట్లు తీసి, 8.6 ఎకానమీ రేటుతో, 4-20 బెస్ట్ బౌలింగ్ గణాంకాలు కలిగిన పతిరన, ఐపీఎల్ వేతన పరిమితి అయిన ₹18 కోట్లకు కొనుగోలు చేయబడటం ఈ వేలంలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు.
ఫ్రాంచైజీల వ్యూహాలకు అద్దం
బేస్ ప్రైస్‌కే అత్యంత విలువైన ఆల్‌రౌండర్ హసరంగా దొరికినప్పటికీ, పతిరన వంటి యువ, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్‌పై జట్లు ఇంత పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం, రాబోయే ఐపీఎల్ సీజన్లలో ఫాస్ట్ బౌలింగ్‌కు ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. హసరంగాను తక్కువ ధరకే దక్కించుకోవడంలో LSG విజయం సాధించగా, పతిరనను చేజిక్కించుకోవడం ద్వారా KKR తమ బౌలింగ్ అటాక్‌ను మరింత బలోపేతం చేసుకుంది.
Read More... IPL Mini Auction: బేస్ ప్రైజ్ కే హసరంగాను దక్కించుకున్న లక్నో.. ప్లాన్ 'B' అదుర్స్






