IPL Mini Auction: బేస్ ప్రైజ్ కే హసరంగాను దక్కించుకున్న లక్నో.. ప్లాన్ 'B' అదుర్స్

by Malleboina Mahesh |   (  Updated:2025-12-16 10:22:52  IST  )

ఐపీఎల్ 2026 సీజన్ కు సంభందించిన మినీ వేలం ఈ రోజు ప్రారంభం అయింది. ఈ మినీ వేలంలో కెమరూన్ గ్రీన్ 25.20 కోట్లకు అమ్ముడు పోయి చరిత్రలో నిలిచాడు.

IPL Mini Auction: బేస్ ప్రైజ్ కే హసరంగాను దక్కించుకున్న లక్నో.. ప్లాన్ B అదుర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ కు సంభందించిన మినీ వేలం ఈ రోజు ప్రారంభం అయింది. ఈ మినీ వేలంలో కెమరూన్ గ్రీన్ 25.20 కోట్లకు అమ్ముడు పోయి చరిత్రలో నిలిచాడు. ఇదిలా ఉంటే పలు కీలక ప్లేయర్లను బెస్ ధరకు కూడా కొనడానికి ఏ జట్టు ముందుకు రాలేదు. ఈ జాబీతాలో భారత జట్టులోని యువ ప్లేయర్ పృథ్వీ షా ఉన్నాడు. ఇదిలా ఉంటే లక్నో సూపర్‌ జెయింట్స్ (LSG) జట్టుకు ఈ ఐపీఎల్ వేలంలో ఊహించని జాక్‌పాట్ తగిలింది.

శ్రీలంక స్టార్ లెగ్-స్పిన్నర్ వనిందు హసరంగాను కేవలం రూ. 2 కోట్ల కనీస ధరకు లక్నో సొంతం చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరున్న హసరంగా, గత సీజన్లలో రూ. 10 కోట్లకు పైగా ధర పలికిన అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన స్పిన్నర్లలో ఒకడైన హసరంగా, ఈ వేలంలో కూడా భారీ ధర పలికే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. కానీ, ఏ ఫ్రాంచైజీ కూడా పోటీ పడకపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ తమ బేస్ ప్రైస్‌కు అతన్ని సొంతం చేసుకుని బిగ్ డీల్‌ను దక్కించుకుంది.

లక్నో యాజమాన్యం తమ పర్స్‌లో డబ్బును ఆదా చేసుకుంటూనే, జట్టుకు అత్యంత అవసరమైన క్లాస్ స్పిన్ ఆల్‌రౌండర్‌ను అతి తక్కువ ధరకు తీసుకోవడంలో సఫలమైంది. హసరంగా రాకతో, కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో జట్టు, రవి బిష్ణోయ్‌తో కలిసి బలమైన స్పిన్ ద్వయాన్ని (Spin Duo) ఏర్పాటు చేసుకోనుంది. పొదుపుగా బౌలింగ్ చేస్తూ, కీలక వికెట్లు తీయగల సామర్థ్యం హసరంగా సొంతం. అంతేకాకుండా, లోయర్ ఆర్డర్‌లో అతను మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగలడు. కేవలం రూ. 2 కోట్లకే దొరకడం LSGకి ఒక మెగా విజయం అనే చెప్పాలి. ఈ కొనుగోలుతో లక్నో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేవు!

విధ్వంసక ఓపెనర్.. రూ.కోటికే దక్కించుకున్న ముంబై

Next Story