ఇవాళ్టి నుంచే సూపర్-8 సమరం.. పాకిస్తాన్ కు కొత్త టెన్షన్ !

by velandi.Saikiran |   (  Updated:2026-02-21 10:15:20  IST  )

ఇవాళ సూపర్ 8లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రేమ దాస స్టేడియం వేదికగా నిర్వహిస్తారు.

ఇవాళ్టి నుంచే సూపర్-8 సమరం.. పాకిస్తాన్ కు కొత్త టెన్షన్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 పోరు నేటి నుంచి ప్రారంభం కానుంది. మొన్నటి వరకు లీగ్ ద‌శలో మ్యాచ్ లు జరిగాయి. ఇక నేటి నుంచి కీలకమైన సూపర్ 8 సంబరం మొదలుకానుంది. ఈ సూపర్ 8 లో మొత్తంగా ఎనిమిది జట్లు ఉంటాయి. ఇందులో నాలుగు జట్లు మళ్లీ సెమీ ఫైనల్స్ కు దూసుకువెళ్తాయి. అప్పుడు ఫైనల్ జట్లు ఏవి అనేది తేలనుంది. ఇక ఇవాళ సూపర్ 8లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది.

ఈ మ్యాచ్ కొలంబో ప్రేమ దాస స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. గ్రూప్ 2 కు సంబంధించిన మ్యాచ్ లు అన్నీ కూడా శ్రీలంకలోనే నిర్వహిస్తారు. భారత జట్టు ఉన్న గ్రూపు 1 మ్యాచ్ లన్ని కూడా ఇండియాలోనే జరుగుతాయి. ఇవాళ కేవలం న్యూజిలాండ్, పాక్ మ్యాచ్ మాత్రమే ఉంటుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య ఫైట్ ఉండనుంది. రాత్రి 7 గంటలకు ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య మోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ ఉంటుంది.

టెన్షన్ లో పాకిస్తాన్

ఇవాళ న్యూజిలాండ్ తో తలపడనున్న పాకిస్తాన్ కాస్త టెన్షన్ లో ఉందట. బాబర్, షాహిన్, షాబాద్ లాంటి ప్లేయర్లు ప్రస్తుతం ఫామ్ లో లేరు. అటు ఫర్హాన్ ఒక మ్యాచ్ ఆడితే మరో మ్యాచ్ లో ఫెయిల్ అవుతున్నాడు. సైమ్ అయూబ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇలా జట్టులో ఉన్న ప్లేయర్లు అంతా గజి బిజిగా ఉన్నారు. వీళ్ళందర్నీ పట్టుకొని సూపర్ 8 మ్యాచ్ లు సల్మాన్ ఎలా గెలుస్తాడు ? అంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

భార‌త్ సెమీస్ వెళ్ల‌డం క‌ష్టమే..పాక్ మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

Next Story