భార‌త్ సెమీస్ వెళ్ల‌డం క‌ష్టమే..పాక్ మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

by velandi.Saikiran |   (  Updated:2026-02-21 10:14:31  IST  )

టీ20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ లో భారత్ అడుగుపెట్టడం అసాధ్యమన్నారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్.

భార‌త్ సెమీస్ వెళ్ల‌డం క‌ష్టమే..పాక్ మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు ప్రదర్శన పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ( Mohammad Amir) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్న భారత జట్టు స్పిరిట్ దెబ్బ‌తినేలా మాట్లాడాడు అమీర్‌. టీ20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ లో భారత్ అడుగుపెట్టడం అసాధ్యమన్నారు. గ్రూప్ దశలో అద్భుతంగా రాణించినప్పటికీ, సూపర్ 8లో మాత్రం భారత్ తేలిపోనుందని హేళ‌న చేశాడు మహమ్మద్ అమీర్. గ్రూప్ దశలో పాకిస్తాన్ పైన మాత్రమే భారత బ్యాటర్లు బాగా ఆడారని గుర్తు చేశారు. యూఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్ల పైన భారత బ్యాటర్లు ఎవరూ కూడా పెద్దగా రాణించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

భార‌త్‌ సెమీస్ చేర‌డం క‌ష్ట‌మే

ఒకరిద్దరూ ఆడరు కాబట్టి.. పసికూన జట్లపైన ఇండియా గెలిచిందన్నారు. ఇక ఇప్పుడు సూపర్ 8 దశలో జింబాబ్వే లాంటి డేంజర్ జట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కచ్చితంగా భారత్ ఈ స్టేజ్ లోనే ఓడిపోయి ఇంటిదారి పడుతుందని మహమ్మద్ అమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ సెమీ ఫైనల్ దాకా వచ్చే ఛాన్స్ లేదన్నారు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మాత్రం సెమీ ఫైనల్ దాకా వస్తాయని అంచనా వేశారు. ఇది ఇలా ఉండగా నేటి నుంచి సూపర్ 8 స్టేజ్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య ఉంటుంది. సూపర్ 8 నేపథ్యంలో ఇండియా తన తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడనుంది. రేపు మోడీ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్ తో భారత్ ఆడనుంది.

ఇవాళ్టి నుంచే సూపర్-8 సమరం.. పాకిస్తాన్ కు కొత్త టెన్షన్ !

Next Story