- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకౌట్‌లో భారత్‌తో ఆడతారా?.. పాక్ కెప్టెన్ ఏమన్నాడంటే?

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో సెమీస్, ఫైనల్‌లో భారత్‌తో ఆడాల్సి వస్తే అప్పుడు కూడా ప్రభుత్వ నిర్ణయమే పాటిస్తామని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపాడు. కొలంబోలో గురువారం నిర్వహించిన కెప్టెన్సీ మీట్‌లో అఘా.. టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరించడంపై స్పందించాడు. ‘భారత్‌తో ఆట నా నియంత్రణలో లేదు. అది ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి, మేము గౌరవిస్తాం. వారు ఏం చెబితే మేము అది చేస్తాం. సెమీస్ లేదా ఫైనల్‌లో భారత్‌తో ఆడాల్సి వస్తే అప్పుడు కూడా మేము ప్రభుత్వ సలహా తీసుకుంటాం.’అని చెప్పాడు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో చెత్త ప్రదర్శన చేసిన పాక్ పసికూన యూఎస్‌ఏ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గ్రూపు దశలోనే నిష్ర్కమించింది. అమెరికా చేతిలో ఓటమిపై అడగ్గా అఘా స్పందిస్తూ.. ‘గత వరల్డ్ కప్‌లో మేము యూఎస్‌ఏ చేతిలో ఓడిపోయాం. కానీ అది ఇప్పుడు గతం. ఇది కొత్త ప్రపంచకప్. కొత్త జట్టుతో ఆడుతున్నాం. కొత్త కాంబినేషన్.’అని చెప్పాడు. వరల్డ్ కప్‌లో పాక్ జట్టు.. శనివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది.






