భారత్ తో మ్యాచ్ ఆడకపోతే, PCB రోడ్డున పడేది.. భజ్జీ సంచలనం!

by velandi.Saikiran |   (  Updated:2026-02-11 05:21:54  IST  )

భారత జట్టుతో జరిగే మ్యాచ్ విషయంలో యూటర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ను హర్భజన్ సింగ్ ఉతికి ఆరేశారు. రోజుకో కొత్త వేషం వేసుకుంటూ పాకిస్తాన్ ఓవరాక్షన్ చేసిందని నిప్పులు చెరిగారు హర్భజన్

భారత్ తో మ్యాచ్ ఆడకపోతే, PCB రోడ్డున పడేది.. భజ్జీ సంచలనం!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎట్టకేలకు జరగనుంది. ఇండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు ముందు పాకిస్తాన్ నాటకాలు ఆడిన సంగతి తెలిసిందే. కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్నింగ్ గట్టిగా ఇవ్వడంతో, పాకిస్తాన్ దిగి వచ్చింది. ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు సంసిద్ధమయింది. దీంతో ఎప్పటిలాగే ఫిబ్రవరి 15వ తేదీన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ త‌రుణంలోనే పాకిస్తాన్ యూ-ట‌ర్న్ పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

పాకిస్తాన్ యూటర్న్ పై హర్భజన్ సీరియస్

భారత జట్టుతో జరిగే మ్యాచ్ విషయంలో యూటర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ను హర్భజన్ సింగ్ ఉతికి ఆరేశారు. రోజుకో కొత్త వేషం వేసుకుంటూ పాకిస్తాన్ ఓవరాక్షన్ చేసిందని నిప్పులు చెరిగారు హర్భజన్. ఇండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్న పాకిస్తాన్.. మళ్లీ ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నట్లు ? అంటూ ప్రశ్నించారు. గంటకు ఒక మాట.. ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. భారత్ తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ మనుగడ సాధించలేదు.. ఈ విషయం వాళ్లకు కూడా తెలుసన్నారు. కానీ బంగ్లాదేశ్ కోసం త్యాగాలు చేసినట్లు బిల్డప్ ఇచ్చారని నిప్పులు చెరిగారు హర్భజన్ సింగ్.

ప్రతి విషయంలో భారత్ పైన పాకిస్తాన్ ఆధారపడి బతకాల్సిందే.. కానీ ఇండియా ఎప్పుడు కూడా పాకిస్తాన్ పైన ఆధారపడకూడదు.. ఆధారపడదు కూడా అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఇలా యూటర్న్ తీసుకుంటుందని తనకు ముందే తెలుసు అని చురకలు అంటించారు. ఒకవేళ భారత జట్టుతో పాకిస్తాన్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే పరిస్థితి వేరే లాగా ఉంటుందని హెచ్చరించారు. ఐసీసీ విధించే జరిమానాలకు... పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రోడ్డున పడే ప్రమాదం కూడా ఉందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హర్భజన్ సింగ్. ఇక ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో మ్యాచ్ ఆడినప్పటికీ... పాకిస్తాన్ కు మాత్రం దెబ్బ గట్టిగానే పడుతుందని తెలిపారు హర్భజన్. ఇండియా ఉన్న ఫామ్ నేపథ్యంలో చిత్తుచిత్తుగా ఓడిపోతుందని పాకిస్తాన్ ఇజ్జత్ తీశారు.

భారత బ్యాటర్లపై బ్యాట్ ట్యాంపరింగ్ ఆరోపణలు !

Next Story