- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత బ్యాటర్లపై బ్యాట్ ట్యాంపరింగ్ ఆరోపణలు !
భారత క్రికెటర్ల పై శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స ( Bhanuka Rajapaksa ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెటర్ల పై శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స ( Bhanuka Rajapaksa ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే భారత బ్యాటర్లు వాడే బ్యాట్లను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు భానుక రాజపక్స. భారత క్రికెటర్లు బ్యాట్ ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇతర జట్లు వాడే బ్యాట్ల కంటే భారత జట్టుకు సంబంధించిన క్రికెటర్లు వాడే బ్యాట్లు తేడాగా ఉంటాయని చెప్ప ప్రయత్నం చేశారు భానుక రాజపక్స.
భారత క్రికెటర్లపై బ్యాట్ ట్యాంపరింగ్ ఆరోపణలు
భారత ప్లేయర్లు వాడే బ్యాట్లు ఎక్కువ పవర్ జనరేట్ చేస్తాయని వెల్లడించారు భానుక రాజపక్స. అయితే ఇతర క్రికెటర్లు వాడే బ్యాట్లు పెద్దగా పనిచేయబోమని చెప్పే ప్రయత్నం చేశారు. తమకు దొరికే బెస్ట్ బ్యాట్స్ కంటే ఇండియా ప్లేయర్ల బ్యాట్లు చాలా మెరుగైనవి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇతర జట్లు వాడే బ్యాట్ల కంటే ఇండియన్ క్రికెటర్ల బ్యాట్లు వాడితే మంచి రిజల్ట్ ఉంటుందని వివరించారు భానుక రాజపక్స. భారత ప్లేయర్లు వాడే బ్యాట్లపై ఒక రబ్బర్ లేయర్ ఉంటుందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇది ఎలా సాధ్యమో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. వేరే వారికి ఈ బ్యాట్లు అస్సలు దొరకబోవని కూడా బాంబు పేల్చారు. ప్రపంచ క్రికెటర్లు అందరికీ ఈ విషయం బాగా తెలుసు అని స్పష్టం చేశారు శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స. దీంతో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
రూల్స్ ప్రకారం ఇది సాధ్యమేనా ?
భారత క్రికెటర్లు ( Indian Cricketers ) వాడే బ్యాట్లపై శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స ( Bhanuka Rajapaksa ) చేసిన వ్యాఖ్యలపై కౌంటర్లు పేల్చుతున్నారు. భారత క్రికెటర్లకు మద్దతుగా మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. భానుక రాజపక్స చేసిన ఆరోపణలలో నిజం లేదని చెబుతున్నారు. కావాలని ఇండియా పై విషం కక్కే ప్రయత్నం జరుగుతోందని ఫైర్ అవుతున్నారు. ఇక రూల్స్ ప్రకారం.. అందరి బ్యాట్లు ఒకే లాగా ఉంటాయని చెబుతున్నారు. బ్యాట్ కొలత, మందం అలాగే బరువు ఇవన్నీ కూడా ఫీల్డ్ అంపైర్లు పరిగణలోకి తీసుకుంటారు. ఈ విషయాన్ని మనం ప్రతి ఐపీఎల్ మ్యాచ్ లో చూడవచ్చు. బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL) మ్యాచ్ లలోనే ఇలాంటి టఫ్ రూల్స్ ఉంటే... ఐసీసీ ( ICC) నిర్వహించే టోర్నమెంటులో మరింత కఠిన తరంగా రూల్స్ ఉంటాయి. దీంతో భానుక రాజపక్స చేసిన వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. ఇక అటు అందరూ కౌంటర్ల పేల్చడంతో శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స ( Bhanuka Rajapaksa ) తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడని సమాచారం.






