కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు కూడా ఇంతగా ఎమోషనల్ అవ్వలేదు: వరుణ్ చక్రవర్తి

by Malleboina Mahesh |   (  Updated:2026-04-20 06:17:27  IST  )

KR భావోద్వేగ విజయం! టైటిల్ గెలిచినప్పుడు కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇన్ని కన్నీళ్లు చూడలేదని 100 వికెట్ల మైలురాయి చేరిన వరుణ్ చక్రవర్తి వెల్లడి.

కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు కూడా ఇంతగా ఎమోషనల్ అవ్వలేదు: వరుణ్ చక్రవర్తి
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో వరుస ఓటమిలతో చతికిల పడిని కేకేఆర్ జట్టు (KKR team)కు ఆదివారం ఎట్టకేలకు మొదటి విజయం దక్కింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన ఆ జట్టు ఐదు మ్యాచుల్లో ఓటమి చవిచూడగా, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచిన కేకేఆర్ కు మొదట గెలుపు అందని ద్రాక్షలా మారింది. ఈ క్రమంలో ఆదివారం రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచులో రింకు సింగ్, అన్‌కూల్ రాయ్ తమ జట్టుకు ఉహించని విజయాన్ని అందించారు.

దీంతో ఆ జట్టు ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు సీజన్ ప్లే ఆఫ్ నుంచి ఎలిమినేట్ అయినట్లే అనుకున్న క్రమంలో వచ్చిన ఈ విజయం జట్టుకు ఎంత ముఖ్యమో వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) మాటల్లో స్పష్టమైంది. "ఈ రోజు నేను మా డ్రెస్సింగ్ రూమ్‌లో చూసినన్ని కన్నీళ్లు.. మేము 2024లో ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు కూడా చూడలేదు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విజయం తమకు చాలా ప్రాముఖ్యమైనదని, దీనివల్ల టోర్నీలో తమ ఆశలు సజీవంగా ఉన్నాయని తెలిపారు.

అలాగే ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి తన మునుపటి ఫామ్‌ను చాటుకున్నారు. అయితే ఈ సీజన్ ఆరంభం నుండి ఆయన గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. సీజన్ ప్రారంభానికి ముందే ఎడమ చేతికి రెండు వేళ్లు ఫ్రాక్చర్ అయ్యాయని, దానివల్ల ఫీల్డింగ్ చేయడం చాలా కష్టంగా మారిందని ఆయన చెప్పారు. ఈ వ్యక్తిగత మైలురాయితో వరుణ్ చక్రవర్తి కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 100 వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా (సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తర్వాత) నిలిచారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే విమర్శల ప్రభావం తమపై పడకుండా కోచింగ్ స్టాఫ్, ముఖ్యంగా అభిషేక్ నాయర్ (Abhishek Nair) తమను కాపాడారని వరుణ్ ప్రశంసించారు. ఒక విజయం తర్వాత పరిస్థితి మారుతుందని, మెల్లమెల్లగా తాము మళ్లీ గాడిలో పడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పంజాబ్ భారీ స్కోరు.. లక్నోఘోర ఓటమి

Next Story