- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజాబ్ భారీ స్కోరు.. లక్నోఘోర ఓటమి
IPL 2026 సీజన్లో భాగంగా నేడు జరిగిన మ్యాచులో లక్నో ఘోర ఓటమిని చవిచూసింది.

దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్లో భాగంగా నేడు జరిగిన మ్యాచులో లక్నో ఘోర ఓటమిని చవిచూసింది. పంజాబ్ బ్యాటర్లు చెలరేగి 254 పరుగుల భారీ స్కోరు చేయగా.. లక్నో 200 పరుగులకే చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్(PBKS) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాంశ్(93), కనోలి(87) పరుగుల భారీ స్కోరు చేసారు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ దుమ్ములేపారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్(LSG) నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పంజాబ్ 54 పరుగుల భారీ తేడాతో విజయం సొంతం చేసుకుంది.
లక్నో బ్యాటర్స్ లో పంత్(43), మార్ర్కం(42), మార్ష్(40) పరుగులు చేసారు. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సెన్ 2, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కో వికెట్ తీశారు. ఇది పంజాబ్ కు ఐదో విజయం కాగా 11 పాయింట్లతో టాప్ లో ఉంది. ఇక లక్నో 8వ స్థానంలో కొనసాగుతోంది.






