Harry Brook : ఒకే ఓవర్లో 5 సిక్సులు కొట్టిన హ్యారీ బ్రూక్ ( వీడియో )

by Disha Web Desk 10 |
Harry Brook : ఒకే ఓవర్లో 5 సిక్సులు కొట్టిన హ్యారీ బ్రూక్  ( వీడియో )
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా క్రికెట్ గ్రౌండ్‌‌లో ఏ క్రికెటర్ అయినా సిక్స్ కొట్టిన , ఫోర్ కొట్టిన వాళ్ళని అమాంతం ఆకాశానికి ఎత్తేస్తారు. అలాగే ఈ వీడియోలో ఉన్న క్రికెటర్ అయితే ఒకే ఓవర్లో 5 సిక్స్ లు చాలా ఈజీగా కొట్టేసాడు. న్యూజిలాండ్ XIతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ మెరుగైన ఆటను ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్ 71 బాల్స్ కు 97 పరుగులు చేయగా ( దీనిలో 7 ఫోర్లు, 9 సిక్స్ లు ఉన్నాయి ). బ్రూక్ స్ట్రైక్ రేట్ 136.62గా ఉంది. హ్యారీ బ్రూక్ కొట్టిన 5 సిక్స్ లు వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బ్రూక్ ఆన్ సైడ్ మొదటి సిక్స్‌ను కొట్టాడు, లెగ్ సైడ్ వైపు రెండవ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత మూడో సారి బలంగా మూడో సిక్స్ కొట్టాడు. బ్యాక్‌ఫుట్‌పై నాలుగో సిక్స్‌ బాదాడు. ఐదో సిక్స్ కోసం స్టెప్స్ ఉపయోగించి కొట్టాడు . ఇలా బ్రూక్ 71 బంతుల్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టి ముందు 97 పరుగులతో వద్ద అవుట్ అయ్యాడు. అతని అభిమానులు సెంచరీ చేసి ఉంటె బావుండేదని అభిప్రాయపడ్డారు.

IPL 2023 కోసం జరిగిన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రూక్‌ను రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో సన్ రైజర్స్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : భారత్ vs ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు ఎవరు చేశారు


Next Story

Most Viewed