- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంభీర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు.. వారికి 36 గంటలు డెడ్‌లైన్ విధించిన ధర్మాసనం

దిశ, స్పోర్ట్స్ : ఏఐ ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా గంభీర్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. గంభీర్‌కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. గంభీర్ పేరు, చిత్రం, వాయిస్, ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ను నిరోధించేలా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. 36 గంటల్లో ఆ వీడియోలను తొలగించాలని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. గంభీర్ తరపు న్యాయవాదులు పలు సోషల్ మీడియా అకౌంట్స్, ఆన్‌లైన్ సెల్లర్స్ గంభీర్ గుర్తింపును దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, అనధికార ఉత్పత్తులను విక్రయిస్తున్నారని వాదించారు. ఆ వాదనలతో కోర్టు ఏకభవించింది. ఈ సందర్భంగా జస్టిన్ జ్యోతి సింగ్ మాట్లాడుతూ..అత్యంత ప్రతిభావంతులైన భారత క్రికెటర్లలో గంభీర్ ఒక్కరని, అతను అనుమతి లేకుండా ఆదాయం ఆర్జించేలా అతని కంటెంట్‌ను, వస్తువులను మార్కెట్‌లోకి తీసుకరావడం అతని వ్యక్తిగత, ప్రచార హక్కులను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. 36 గంటల్లో ఆ కంటెంట్‌ను తొలగించడంతోపాటు బాధ్యుల వివరాలను వెల్లడించాలని ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టెక్ ప్లాట్‌ఫామ్స్ మెటా, గూగుల్‌లను ఆదేశించింది.






