విమర్శకులపై మిచెల్ స్టార్క్ ఫైర్.. కేకేఆర్ జట్టుకు అభిమానులకు క్షమాపణలు

by Malleboina Mahesh |   (  Updated:2026-03-28 15:45:38  IST  )

ఐపీఎల్ తొలి సగానికి మిచెల్ స్టార్క్ దూరం. తన గాయంపై వస్తున్న తప్పుడు వార్తలపై ఆగ్రహం; డెల్లీ క్యాపిటల్స్ అభిమానులకు క్షమాపణలు

విమర్శకులపై మిచెల్ స్టార్క్ ఫైర్.. కేకేఆర్ జట్టుకు అభిమానులకు క్షమాపణలు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఆ జట్టు ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) భుజం, మోచేయి గాయాల కారణంగా సీజన్ తొలి సగానికి దూరం కానున్నట్లు ప్రకటించారు. అయితే, తన లభ్యతపై భారత మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు, కొందరు వ్యక్తులు చేస్తున్న విమర్శలపై స్టార్క్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన గాయం తీవ్రత ఆస్ట్రేలియా సమ్మర్ సీజన్ సమయంలో తనకు తెలియదని, ప్రస్తుతం తాను కోలుకోవడానికి (Rehab) ప్రయత్నిస్తున్నానని ఆయన వివరించారు. "కొందరు వ్యక్తులు తమ ప్లాట్‌ఫారమ్‌లను వాడుకుని ఆటగాళ్ల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నా శరీరం గురించి నాకంటే వారికే ఎక్కువ తెలుసన్నట్టు వింత వాదనలు చేస్తున్నారు" అని స్టార్క్ ఘాటుగా స్పందించారు.

మరోవైపు, కీలక సమయంలో గాయం కారణంగా జట్టుకు అందుబాటులో లేకపోవడంపై స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. ఈ విరామం జట్టుకు ఇబ్బందికరమని తనకు తెలుసని, కానీ తాను ఇప్పటికీ ఢిల్లీ జట్టుకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను జట్టు మేనేజ్‌మెంట్‌తో నిరంతరం టచ్‌లోనే ఉన్నానని, వీలైనంత త్వరగా కోలుకుని మైదానంలోకి దిగేందుకు ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. గత వేలంలో భారీ ధరకు అమ్ముడైన స్టార్క్, సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడం డెల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, స్టార్క్ పునరాగమనం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గంభీర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు.. వారికి 36 గంటలు డెడ్‌లైన్ విధించిన ధర్మాసనం

Next Story