- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీ కోసం చెట్టెక్కిన అభిమానులు
<ul class='hocal_short_desc'><li>విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో బెంగళూరులో ఢిల్లీ, ఆంధ్ర జట్లు తలపడగా ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.</li></ul>

దిశ, వెబ్ డెస్క్ : విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో బెంగళూరులో ఢిల్లీ, ఆంధ్ర జట్లు తలపడగా ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ 101 బంతుల్లో 131 పరుగులతో అద్భుత సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్ లకు లైవ్ ప్రసారం లేకపోవడం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో గేట్లు తెరవకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. భద్రతా కారణాల వల్ల కర్ణాటక ప్రభుత్వం ఎం.చిన్నస్వామి స్టేడియానికి అనుమతి ఇవ్వకపోవడంతో కేఎస్‌సీఏ ఈ మ్యాచ్‌ను COEకి మార్చింది.
అయితే ఎలాగైనా మ్యాచ్ చూడాలని కొంతమంది అభిమానులు చెట్లపైకి ఎక్కి కోహ్లీ బ్యాటింగ్‌ను చూసారు. అయితే ఇలా అభిమానులు చెట్లెక్కి మ్యాచ్ తిలకించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాప్ ఆటగాళ్లు ఆడే మ్యాచ్‌లకైనా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేయాలని అభిమానులు బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు.
Read More..






