- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి రోజే విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల సునామీ
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ (2025-26) తొలి రోజే రికార్డుల మోత మోగింది. భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు యువ ఆటగాళ్లు మైదానంలో పరుగుల వరద పారించారు.

దిశ, వెబ్ డెస్క్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ (2025-26) తొలి రోజే రికార్డుల మోత మోగింది. భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీలతో పాటు యువ ఆటగాళ్లు మైదానంలో పరుగుల వరద పారించారు. ఒకే రోజు పదుల సంఖ్యలో సెంచరీలు నమోదు కావడంతో దేశవాళీ క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రధానంగా ముంబై తరఫున బరిలోకి దిగిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (155) కేవలం 94 బంతుల్లోనే విరుచుకుపడి తన ఫామ్‌ను చాటుకోగా, కింగ్ విరాట్ కోహ్లీ (131) తన క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ఢిల్లీకి భారీ స్కోరు అందించాడు. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు సుదీర్ఘ కాలం తర్వాత దేశవాళీ వన్డేల్లో మెరవడం విశేషం.
యువ ఆటగాళ్ల విషయానికి వస్తే, 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ 190 పరుగులతో ఆడిన ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు చేసిన అతను తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరోవైపు జార్ఖండ్ స్టార్ ఇషాన్ కిషన్ 125 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి వన్డేల్లో T20 తరహా విధ్వంసాన్ని సృష్టించాడు. ఒడిశా బ్యాటర్ స్వాస్తిక్ సామల్ (212) అద్భుత ద్విశతకంతో అదరగొట్టగా, సకీబుల్ గని (128*), దేవదత్ పడిక్కల్ (147), విష్ణు వినోద్ (102*) వంటి ప్లేయర్లు కూడా భారీ సెంచరీలతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఐపీఎల్ మెగా వేలం ముగిసిన వెంటనే కుర్రాళ్లు ఈ రేంజ్ ప్రదర్శన చేయడం భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకంగా కనిపిస్తోంది.






