- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత షూటింగ్ రంగంలో తీవ్ర విషాదం.. లెజెండరీ షూటర్ జస్పాల్ రాణా కన్నుమూత
ప్రముఖ లెజెండరీ షూటర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత జస్పాల్ రాణా హఠాన్మరణం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ షూటర్, ప్రముఖ కోచ్ జస్పాల్ రాణా (Jaspal Rana) కన్నుమూశారు. ఆయన మరణవార్తను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) అధికారికంగా ధృవీకరించింది. జస్పాల్ రాణా హఠాన్మరణంతో అటు క్రీడా వర్గాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ISSF వరల్డ్‌కప్ నుంచి తిరిగి వస్తుండగా జస్పాల్ రాణా ఫ్లైట్‌లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2006 ఆసియా క్రీడల్లో జస్పాల్ రాణా దేశానికి బంగారు పతకం సాధించి పెట్టారు. షూటింగ్ రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనను ‘ద్రోణాచార్య అవార్డు’తో సత్కరించింది.
మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి.. సురక్షితంగా బయటపడిన RSS చీఫ్
Next Story






