- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి.. సురక్షితంగా బయటపడిన RSS చీఫ్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌కు పెను ప్రమాదం తప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) ప్రయాణిస్తున్న రైలుపై గుర్తుతెలియని దుండగులు రాళ్లు రువ్విన ఘటన ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది. ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ రాళ్ల దాడిలో మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీ (E1) కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే, ఈ ప్రమాదంలో మోహన్ భాగవత్‌తో పాటు ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారుల కథనం మేరకు కాన్పూర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (Swarna Shatabdi Express) రాత్రి 7.15 గంటల సమయంలో ఫిరోజాబాద్‌లోని రసూల్‌పూర్, దక్షిణ్ పోలీస్ స్టేషన్ సరిహద్దు ప్రాంత గుండా వెళ్తోంది. ఈ క్రమంలోనే కొందరు దుండగులు ఒక్కసారిగా రైలుపైకి రాళ్లు విసిరారు. ఓ పెద్ద రాయి మోహన్ భాగవత్ కూర్చున్న సీటు వైపు ఉన్న కిటికీకి బలంగా తగిలింది. దీంతో కిటికీ బయటి వైపు ఉన్న గ్లాస్ పూర్తిగా పగిలిపోయింది. ఆ సమయంలో యూపీ పంచాయతీ రాజ్ మంత్రి భూపేంద్ర చౌదరి కూడా అదే బోగీలో ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం.
అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్..
అయితే, ఘటన జరిగిన వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఆగ్రా జోన్ ADG ఎస్‌కే భగవత్, ఫిరోజాబాద్ ఎస్ఎస్పీ ఆదిత్య లాంగే స్పాట్‌కు చేరుకున్నారు. రైలును కాసేపు తుండ్లా జంక్షన్ వద్ద నిలిపివేసి తనిఖీలు చేసిన అనంతరం ఢిల్లీకి సురక్షితంగా పంపేశారు. ఈ దాడికి సంబంధించి పోలీసులు ఇప్పటికే అనుమానితుడైన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైల్వే ట్రాక్ పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ ఆదిత్య లాంగే తెలిపారు.






