మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో కార్మికుడు మృతి.. ఆలస్యంగా వెలుగులోకి!?

by Jakkula.Mamatha |

గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో కార్మికుడు మృతి.. ఆలస్యంగా వెలుగులోకి!?
X

దిశ, జిన్నారం: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో మూడు రోజుల క్రితం ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు ప్రవీణ్ కుమార్(25) ప్రమాదంలో గాయపడగా గుట్టు చప్పుడు కాకుండా సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మృతుడిది హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story