- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాన్సర్ మందుల కొరతకు బ్రేక్.. ధరలు భారీగా పెంచుతూ NPPA నిర్ణయం
దేశంలో లైఫ్ సేవింగ్ క్యాన్సర్ మందులు, వ్యాక్సిన్ల కొరతకు కేంద్ర ప్రభుత్వం కీలక పరిష్కారం చూపింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్‌లో ఎమర్జెన్సీ క్యాన్సర్ (Cancer) మందులు, ముఖ్యమైన వ్యాక్సిన్ల తీవ్ర కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ సేవింగ్ ఔషధాల గరిష్ట ధర పరిమితిని పెంచుతూ ఇవాళ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. ధరలు తక్కువగా ఉండటం వల్ల ఫార్మా కంపెనీలు మందుల ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడం, నిలిపివేయడం మార్కెట్‌లో ఏర్పడిన కృత్రిమ కొరతను నివారించడానికే ఎన్‌పీపీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ధరలు పెంపునకు ప్రధాన కారణాలివే..
కాగా, గత కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో మందుల తయారీకి వాడే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (API) ధరలు భారీగా పెరిగాయి. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన పాత గరిష్ట ధరలతో ఉత్పత్తి వ్యయం కూడా రాకపోవడంతో పలు ఫార్మా కంపెనీలు క్యాన్సర్ మందుల తయారీని కొన్ని తగ్గించగా.. మరికొన్ని పూర్తిగా నిలిపివేశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆసుపత్రులు, ఫార్మసీల్లో ఎమర్జెన్స్ క్యాన్సర్ డ్రగ్స్, స్పాట్‌లో ప్రాణాలు నిలబెట్టే వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇది రోగుల ప్రాణాల మీదకు తెచ్చే పరిస్థితిగా పరిణమించడంతో ఎన్‌పీపీఏ రంగంలోకి దిగింది. మందుల ధరలు కాస్త పెంచినా.. అవి మార్కెట్‌లో రోగులకు రెగ్యులర్‌గా అందుబాటులో ఉండటమే అత్యంత ముఖ్యమని భావించింది. అనంతరం డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO లోని ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఎంపిక చేసిన కొన్ని క్యాన్సర్ నివారణ ఔషధాలు, వ్యాక్సిన్ల ధరలను పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.






