- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాకా’ విషయంలో బన్నీకి ప్లస్ అవుతున్న ఆ సెంటిమెంట్
పుష్ప 1, 2 డిసెంబర్‌లో రిలీజ్ అయ్యి సక్సెస్ కావడంతో అదే సెంటిమెంట్‌తో ‘రాకా’ విషయంలో కూడా ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను 2027 డిసెంబర్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి వెనుక ఒక ప్రత్యేక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్ ముఖ్యమైనవి. ‘పుష్ప 1’ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేయగా అది అద్భుతమైన విజయాన్ని సాధించి అల్లు అర్జున్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. అంతేకాకుండా ఆయనకు నేషనల్ అవార్డు కూడా లభించింది. అలాగే అనేక వాయిదాల తర్వాత విడుదలైన ‘పుష్ప 2’ కూడా అదే డిసెంబర్ సెంటిమెంట్‌తో వచ్చి భారీ వసూళ్లను సాధించింది.
ఇలా డిసెంబర్ నెల అల్లు అర్జున్‌కు బాగా కలిసి రావడంతో అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ‘రాకా’ చిత్రాన్ని కూడా డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అయితే, అల్లు అర్జున్‌కు మరో భారీ విజయం ఖాయం అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించనుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ భారీ బడ్జెట్ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.






