- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ ఫ్రీ బస్సు ఉన్న లేనట్లే.. ప్రయాణికుల అవస్థలు!
మంచిర్యాల డిపో నుంచి బెల్లంపల్లి నియోజకవర్గం భీమినికి వచ్చే ఆర్టీసీ బస్సు సమీప గ్రామాల కూడళ్ల వద్ద బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో బస్సు కోసం వేచి చూసే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ,భీమిని: మంచిర్యాల డిపో నుంచి బెల్లంపల్లి నియోజకవర్గం భీమినికి వచ్చే ఆర్టీసీ బస్సు సమీప గ్రామాల కూడళ్ల వద్ద బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో బస్సు కోసం వేచి చూసే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బెల్లంపల్లి బజార్ ఏరియా నుంచి భీమినికి 10 గంటల ప్రాంతంలో వచ్చిన ఆర్టీసీ బస్సు ప్రతి రోజు తెనుగుపల్లె గ్రామం వరకు వెళ్తుంది. తిరిగి బెల్లంపల్లి వైపు వెళ్ళే సమయంలో డ్రైవర్ పలు గ్రామాల కూడళ్ల వద్ద బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి, మంచిర్యాల వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.18 కిలోమీటర్ల వరకు ఆటోలో వెళ్తే రూ.70 ఛార్జీలు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. రెండు రోజులుగా బస్ కొన్ని గ్రామాల వద్ద ఆపడం లేదన్నారు. మండలానికి బస్ సౌకర్యం ఉన్న లేనట్టేనని ప్రయాణికులు మండిపడ్డారు. ఉదయం డ్యూటీలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.






