- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేస్ కళాశాలలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం
by Jakkula.Mamatha |
కోదాడ పట్టణంలోని రేస్ కళాశాలలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, పట్టణ ఎస్సై సుధీర్ కుమార్ పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల పై విస్తృతంగా అవగాహన కల్పించారు.

X
దిశ, కోదాడ: కోదాడ పట్టణంలోని రేస్ కళాశాలలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, పట్టణ ఎస్సై సుధీర్ కుమార్ పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల పై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు లోనుకాకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం, సమాజం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story






