- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీర్లపల్లిని సంపూర్ణంగా అభివృద్ది చేస్తాం : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
వీర్లపల్లిని సంపూర్ణంగా అభివృద్ది చేస్తామని రామగుండం శాసన సభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు.

దిశ, గోదావరిఖని : వీర్లపల్లిని సంపూర్ణంగా అభివృద్ది చేస్తామని రామగుండం శాసన సభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా శుక్రవారం 21 వ డివిజన్ లో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టూ పరిశ్రమల కారణంగా దుష్ప్రభావం పడడంతో పాటు గతంలో ప్రజా ప్రతినిధుల పట్టించుకోకపోవడంతో వీర్లపల్లి గ్రామం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. సింగరేణి గనుల ఏర్పాటు, ఎన్ టి పి సి రైల్వే లైన్ నిర్మాణం, ఆర్ఎఫ్ సీఎల్ పునరుద్దరణ సమయంలో సరైన ప్యాకేజీ ఇవ్వకపోవడంతో వీర్లపల్లికి అన్యాయం జరగిందన్నారు. తాను ప్రయత్నం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారం లేక వీర్ల పల్లి గ్రామానికి ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలుకావడం లేదన్నారు. అయినప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రివర్యుల సహకారంతో వీర్లపల్లి గ్రామస్తులకు ఇతర ప్రాంతంలో స్థలాలు, ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ 5.00 లక్షల ఆర్థిక సహాయం ఇప్పించడంతో పాటు స్థానికంగా కూడా అన్ని వసతులు కల్పిoచనున్నామని అన్నారు. మురుగు నీళ్ళు సాఫీగా బయటకు వెళ్ళడానికి సరైన డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయిస్తామని అన్నారు.
ప్రైవేటు వ్యక్తుల స్థలంలో నుంచి కాలువ నిర్మించాల్సి ఉండటంతో యజమానికి మరో చోట స్థలం ఇస్తామని అన్నారు. ఆర్ఎఫ్సీఎల్ కంపెనీ ప్రహరీ ఆనుకొని ఉన్న వీర్ల పల్లి గ్రామంతో పాటు ఎల్కలపల్లి గేట్, లక్ష్మీ పురం, చైతన్య పురి కాలనీ తదితర ప్రాంతాలన్నీ దత్తత తీసుకొని సీఎస్ఆర్ కింద పూర్తిగా అభివృద్ది చేయాలని సంబందిత కంపెనీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా ఆర్ ఎఫ్సీఎల్ కారణంగా ఉత్పన్నమవుతున్న పలు సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రహరీ అవతల తుప్పలు పొదలు తొలగించి విష సర్పాలు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్లాంట్ శుభ్రం చేసేటప్పుడు నీళ్ళు గోడ అవతల ఉన్న ఇళ్ల లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే గ్రామంలో స్వశక్తి మహిళలకు అవగాహన కల్పించి ఇందిరా మహిళా శక్తి యూనిట్లు ఏర్పాటు చేసుకొని సంఘానికి రూ 30 లక్షల నుండి రూ 3.00 కోట్ల వరకు రుణం ఇప్పించి స్వయం ఉపాధి పొందడానికి మెప్మా ద్వారా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న చిన్న కాలువలతో పాటు పెద్ద కాలువలో పెరిగిన తుప్పలను తొలగించి నీళ్ళు సాఫీ గా ప్రవహించడానికి మార్గం సుగమం చేశారు. స్వశక్తి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థతో పాటు వివిధ విభాగాల అధికారులు, మెప్మా ఆర్.పీలు, స్థానికులు పాల్గొన్నారు.






