- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేశినేని బ్రదర్స్ మధ్య మరింత ముదిరిన వివాదం.. ఈడీ వరకూ వెళ్లిన కంప్లైంట్స్
విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. రాజకీయం నుంచి వ్యక్తిగతం వరకూ వెళ్లింది. గత ఎన్నికలకు ముందు ఇద్దరి మధ్య విభేదాలు మధ్య తలెత్తాయి. దీంతో కేశినేని నాని వైసీపీలోకి వెళ్లారు.....

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో కేశినేని బ్రదర్స్(Kesineni Brothers) మధ్య వివాదం మరింత ముదిరింది. రాజకీయం నుంచి వ్యక్తిగతం వరకూ వెళ్లింది. గత ఎన్నికలకు ముందు ఇద్దరి మధ్య విభేదాలు మధ్య తలెత్తాయి. దీంతో కేశినేని నాని వైసీపీలోకి వెళ్లారు. కేశినేని చిన్ని టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. అయితే అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ విమర్శలు కొనసాగాయి. కానీ ఇటీవల కాలం నుంచి అవి మరింత ముదిరాయి. కామెంట్స్ నుంచి కంప్లైట్స్ వరకూ వెళుతున్నాయి.
కేశినేని చిన్నిపై కంప్లైంట్
తాజాగా మాజీ ఎంపీ కేశినేని నాని(Former MP Kesineni Nani) తన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని(MP Kesineni Chinni)పై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు చిన్నిపై ఫిర్యాదు చేస్తూ ఈడీకి లేఖ రాశారు. చిన్ని అక్రమ నెట్‌వర్క్ పై దర్యాప్తు చేయించాలంటూ లేఖలో పేర్కొన్నారు. కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన భార్య జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్ చౌదరి నెట్‌వర్క్‌పై మనీ లాండరింగ్ కింద అత్యవసర దర్యాప్తు చేయాలని కోరారు. ఎంపీ టిక్కెట్ కోసం కేశినేని చిన్ని ఐదు కోట్లు తీసుకున్నట్లు టిడిపి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణలపైనా విచారణ జరిపించాలని చెప్పారు. అలాగే సుంకర రామచంద్రరావు, బొల్లినేని మోహన్ రావు అకౌంట్లకు అమౌంట్ ట్రాన్స్‌ఫర్లు మీద దర్యాప్తు చేయాలని లేఖలో కేశినేని నాని కోరారు.
నాని ఆరోపణలపై..
అయితే కేశినేని నాని ఆరోపణలపై ఇప్పటికే కేశినేని చిన్ని స్పందించారు. అధారాలుంటే చూపించాలని సవాల్ విసిరారు. లేని పక్షంలో కేశినేని నానిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తన రాజకీయ ఎదుగుదలను కేశినేని నాని ఓర్వలేకపోతున్నారని చిన్ని విమర్శించారు.






