అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది

by Taduka Kalyani |

భారతదేశంలో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అంతరిక్ష మంత్రిత్వ శాఖ సాంకేతిక విభాగం డైరెక్టర్ రాజీవ్ జ్యోతి అన్నారు.

అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది
X

దిశ, నర్సాపూర్ : భారతదేశంలో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అంతరిక్ష మంత్రిత్వ శాఖ సాంకేతిక విభాగం డైరెక్టర్ రాజీవ్ జ్యోతి అన్నారు. నర్సాపూర్ పట్టణ సమీపంలోని బి వి ఆర్ ఐ టి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అంతర్జాతీయ 5వ ఐ ఈఈఈ వైర్లెస్ యాంటీనా అండ్ మైక్రోవేవ్ సింపోజియం వామ్స్ 2026 కార్యక్రమం శుక్రవారం మూడవరోజు విజయవంతంగా కొనసాగింది. దేశ విదేశాల నుంచి వచ్చిన పరిశోధకులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు ఉత్సాహభరిత భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. అయితే విద్యాసంస్థల సహకారం పై నిర్వహించిన ప్రత్యేక ప్యానల్ చర్చలో ముఖ్యఅతిథిగా భారత ప్రభుత్వ అంతరిక్ష మంత్రిత్వ శాఖ సాంకేతిక విభాగం డైరెక్టర్ రాజీవ్ జ్యోతి హాజరై మాట్లాడారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష రంగం అందులోని అవకాశాలు, విలువైన సమాచారాన్ని తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ సంజయ్ దూబే మాట్లాడుతూ.. భారత అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్న ప్రముఖ నిపుణులలో ఒకరైన శ్రీ రాజీవ్ జ్యోతి నుంచి విద్యార్థులు, అధ్యాపకులు ప్రత్యక్షంగా నేర్చుకునే అరుదైన అవకాశం లభించింది అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు, విద్యార్థులు అధ్యాపకులతో పాటు కళాశాల మేనేజర్ బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story