భారీ ఈదురు గాలితో కూడిన భారీ వర్షం..

by Kodari Anjali |

భారీ వర్షానికి గురువారం రాత్రి పాలకవీడు మండలంలోని గుండెబోయిన గూడెం గ్రామానికి చెందిన ముండ్ల మరియన్న పశువుల షెడ్డు కూలిపోయింది.

భారీ ఈదురు గాలితో కూడిన భారీ వర్షం..
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి గురువారం రాత్రి పాలకవీడు మండలంలోని గుండెబోయిన గూడెం గ్రామానికి చెందిన ముండ్ల మరియన్న పశువుల షెడ్డు కూలిపోయింది. ఆ సమయంలో అందులో పశువులు లేకపోవడంతో పశువులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పశువులకు నీడనిచ్చే పశువుల షెడ్ కూలిపోవడంతో ‌ ఆ పశువులకు నీడ లేకుండా పోయింది. 50వేల వరకు నష్టం జరిగిందని బాధిత పాడి రైతు వాపోయారు. పశువుల షెడ్డుకు ఏర్పాటు చేసుకున్నందుకు ప్రభుత్వం ఆదుకునే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అందించాలని కోరారు.

Next Story