టీఆర్ఎస్ పార్టీ లోకి జర్నలిస్ట్ భూశంకర్ ను ఆహ్వానించిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత

by Nallavelli.Anjaneyulu |

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పాత్రికేయుడు మా రేపు భూశంకర్, మారేపు అంజమ్మ ను టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క.

టీఆర్ఎస్ పార్టీ లోకి  జర్నలిస్ట్ భూశంకర్ ను ఆహ్వానించిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పాత్రికేయుడు మా రేపు భూశంకర్, మారేపు అంజమ్మ ను టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క. హైదరాబాద్ లోని కవితక్క నివాసంలో తాము కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తామని కష్టపడి పార్టీని బలోపేతం చేస్తామని మా రేపు భూశంకర్ మారేపు అంజమ్మలు తెలిపారు. హైద‌రాబాద్ లోని కవితక్క నివాసంలోని కలిసి కవితక్కకు పూల గుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని కవితక్క నేతృత్వంలో బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డలంతా ఏకం కావాలని కలిసికట్టుగా ఉండి బీసీ బిల్లులపై పోరాటం చేసి సాధించుకోవాలన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కాబోయే సీఎం కవితక్క అని వారు కొనియాడారు.

Next Story