శాంతి భద్రతల పరిరక్షణ తన ప్రథమ కర్తవ్యం

by Nallavelli.Anjaneyulu |

శాంతిభద్రతల పరిరక్షణ తన ప్రథమ కర్తవ్యం అని దేవరకద్ర నూతన ఎస్సై భాస్కర్ రెడ్డి అన్నారు.

శాంతి భద్రతల  పరిరక్షణ తన ప్రథమ కర్తవ్యం
X

దిశ, దేవరకద్ర : శాంతిభద్రతల పరిరక్షణ తన ప్రథమ కర్తవ్యం అని దేవరకద్ర నూతన ఎస్సై భాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర నూతన ఎస్సైగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అక్రమార్కులను ఉద్దేశించి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఫిల్టర్ ఇసుక తయారీ, అక్రమ ఇసుక రవాణా ,అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిపై ఉక్కు పాదం మోపుతామని, రాత్రి పూట గస్తిని పటిష్టం చేస్తామని ఫ్రెండ్లీ పోలీసింగ్ తో 24/7 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని అవినీతి రహితంగా, పారదర్శకంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల భాగ్యస్వామ్యంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎస్సై భాస్కర్ రెడ్డి మండల ప్రజలకు భరోసా ఇచ్చారు. నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై భాస్కర్ రెడ్డికి పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story